అన్ స్టాపబుల్: “ఓడిపోవడానికి కూడా నేను సిద్ధమే” అంటూ తేల్చేసిన పవన్.!

-

అన్ స్టాపబుల్.. ప్రముఖ నటుడు.. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 తాజా ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఇకపోతే గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికే మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకోగా.. ఇప్పుడు సెకండ్ సీజన్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రారంభించారు.

ఇకపోతే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక ఎపిసోడ్లో ఆయన త్రివిక్రమ్ తో కూడా ఫోన్లో మాట్లాడారు. తాజాగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి కిందట విడుదలవగా ఎన్నో ఊహించని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయని ఉత్కంఠ అభిమానులలో రేకెత్తుతోంది.

ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ పెద్దగా నవ్వడం కనిపించింది. ఆ రాజకీయాలే వద్దు అంటే బాలకృష్ణ ఆయనను వారించారు. నీ విమర్శల్లో వాడి వేడి బాగా పెరిగిందని.. డబుల్ ఇంపాక్ట్ అయిందంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. దానికి పవన్ కళ్యాణ్ లేదు నేను చాలా పద్ధతిగా మాట్లాడుతానండి.. అని బదులిచ్చారు.ఇకపోతే రాజకీయాలలో కూడా తాను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version