Unstoppable With NBK 2 : ఎన్నడూ చూడని కొత్త అవతారంలో బాలయ్య

-

సినిమాల‌తోనే కాకుండా హోస్ట్ గా త‌న‌లోని మ‌రో టాలెంట్ ను బ‌య‌ట పెడుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతున్నారు హీరో నంద‌మూరి బాల కృష్ణ‌. తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో లో బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షో కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.


టాలీవుడ్‌ స్టార్లు ఈ షోకు వచ్చి సందడి చేశారు. అయితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రకటించింది. అయితే.. తాజాగా ఈ షో నుంచి బాలయ్య పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ లో బాలయ్య అదిరిపోయే లుక్‌ లో కనిపిస్తున్నారు. అచ్చం కౌవ్‌ బాయ్‌ లా మనకు కనిపిస్తున్నాడు. ఈ షో టీజర్‌ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ కానున్న నేపథ్యంలో.. ఈ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది ఆహా.

Read more RELATED
Recommended to you

Exit mobile version