హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. గురువారం మధ్యాహ్నం నుంచే క్రికెట్ లవర్స్ భారీగా మైదానానికి చేరుకున్నారు. దీనితో మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా (OG సినిమా)లోని ‘హంగ్రీ చీతా (ఆకలితో ఉన్న చిరుత) పాట పాడి మైదానాన్ని హోరెత్తించారు.
ఆడియన్స్ కూడా ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ అంటూ తమన్ కు కోరస్ ఇచ్చారు. దీంతో మైదానమంతా దద్దరిల్లింది. తమన్ లైవ్ పెర్ఫామెన్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపిందని విశ్లేషకులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్‌లో టాస్ లక్నో జట్టు బౌలింగ్ ఎంపికగా, హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ 82 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయింది.