టాలీవుడ్ లో కలకలం.. ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ కానున్నాయి. లెబర్ కమిషనర్ ను తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తాజాగా కలిశారు. వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు సినీ కార్మికులు. వేతనాలు పెంచకపోతే ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ చేస్తాము అని ఫిల్మ్ ఛాంబర్ కు చెప్పారు ఫెడరేషన్ కార్మికులు.

మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటున్నారు సినీ కార్మికులు. సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో ఫెడరేషన్ నాయకులు ఛాంబర్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలలో షూటింగ్స్ బంద్ విషయం కోలోక్కివచ్చే అవకాశం ఉందంటున్నారు ఛాంబర్ సభ్యులు.