బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహాన్ని నింపే మాటలు చెప్పారు. యువత పెద్ద కలలు కనాలని చెప్పారు. కలలు సాధించేందుకు చాలా కష్టపడాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. జీవితం చాలా చిన్నది కావున అసాధ్యమైన వాటి గురించి కలలను కనాలి అంటూ కేటీఆర్ అన్నారు.

మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి లేనట్లయితే మీరు జీవించడంలో ఎలాంటి అర్థం ఉండదు. ఎవరు ఏం చెప్పినా వినకుండా మీ మనసుకు నచ్చిందే చేయండి అంటూ కేటీఆర్ మీడియా సమావేశంలో అన్నారు. అలాంటి యువతకు నేను ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇస్తాను అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.