పవన్ కల్యాణ్​పై హీరోయిన్ పోస్ట్.. నెట్టింట ఫుల్ ట్రోలింగ్

-

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. కానీ తను చేసే పొరపాట్ల వల్ల ఊర్వశి తరచూ ట్రోలింగ్​కు గురవుతూ ఉంటుంది. తాజాగా ఈ భామ పెట్టిన పోస్టు నెట్టింట దుమారం రేపుతోంది. ఏ ఉద్దేశంతో ఆ పోస్టు పెట్టిందో కానీ నెట్టింట విమర్శలు ఎదుర్కొంటోంది. పవర్ స్టార్ ను ఏపీ సీఎం అని వ్యాఖ్యానించడమే అందుకు కారణం.

పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఇందులో ఆమె ఓ పాటలో నటించింది. సినిమా శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా సోషల్ మీడియా ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారామె. ‘బ్రో’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని ఊర్వశి ట్వీట్ చేసింది. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌’, ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు?’, ‘పవన్‌ సీఎం ఎప్పుడయ్యారు?’, ‘ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version