బీ కేర్ ఫుల్..భయం కేరాఫ్ దెయ్యం అంటున్న రవిబాబు..!

-

ప్రముఖ నటుడు డైరెక్టర్ రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎక్కువగా హార్రర్ సినిమాలను తెరకేక్కిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తనకంటూ ఒక ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. రవిబాబు డైరెక్షన్లో సినిమా వస్తోందంటే చాలు కచ్చితంగా ప్రేక్షకులు భయపడి పోతారు. అంతలా తన డైరెక్షన్ తో సినిమాలతో దడ పుట్టిస్తూ అందరిని భయపెట్టిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా బీ కేర్ ఫుల్ భయం కేరాఫ్ దెయ్యం అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నాడు రవిబాబు.

గతంలో గ్రామాలలో మాతంగులుగా జీవిస్తున్న వాళ్లలో ఒక స్త్రీ జీవిత కథ ఆధారంగా హార్రర్ థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ సైకో విలన్ పాత్రధారి సత్య ప్రకాష్ గుప్తనిధులు తీసే తాంత్రికుడు పాత్రలో నటించగా.. రవిబాబు ఒక మాంత్రికుడు పాత్రలో నటిస్తున్నారు. స్మశాన కాపరిగా గబ్బర్ సింగ్ రాజశేఖర్ , ప్రేమ కథా చిత్రం ఫేమ్ సైదులు, జబర్దస్త్ జూనియర్ పోసాని చిట్టిబాబు తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేసింది ఈ సినిమా.

ఈ సినిమాను తెలుగు మరియు కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో మాతంగి క్యారెక్టర్ లో రమ్య నటించారు. రమ్య మాట్లాడుతూ.. నాకు మాతంగి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది . ముఖ్యంగా వాళ్ళ జీవిత కథనం వింటుంటేనే కన్నీరు మున్నీరయ్యాను నాతోపాటు చేసిన కొంతమంది చిన్నపిల్లలు కూడా నిజంగానే ఏడ్చేశారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ఈ సినిమాతో మరొకసారి భయభ్రాంతులకు గురి చేయడానికి సిద్ధమవుతున్నారు రవిబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version