ఉప్పెన స్టార్ కి వ‌రుస ఆఫ‌ర్లు.. వైష్ణ‌వ్ ఖాతాలో మ‌రో ప్రాజెక్టు

ఉప్పెన‌తో ఒక్క సారిగా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్నాడు మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్. త‌న మొద‌టి డెబ్యూ మూవీతోనే ఏకంగా రూ.100కోట్ల క్ల‌బ్ లో చేరిపోయాడు. దీంతో మ‌నోడికి ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. చాలా మందికి ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ మ‌నోడి ల‌క్ కొద్దీ ఒక్క సినిమాతోనే వ‌చ్చేసింది. దీంతో మ‌నోడు ఫుల్ కుషీలో ఉన్నాడు.

Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena
Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena

 

ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, హీరోయిన్ కృతి శెట్టి కూడా విప‌రీతంగా ఫేమ‌స్ అయిపోయాడు. వ‌రుస బెట్టి ఆఫ‌ర్లు కొట్టేస్తున్నారు. మ‌రి హీరోయిన్, డైరెక్ట‌ర్ కే అంత ఆఫ‌ర్లు వ‌స్తే.. హీరోకి ఏ రేంజ్ లో రావాలి. అవును ఇప్పుడు అలాగే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి వైష్ణ‌వ్ కు.

ఇప్ప‌టికే క్రిష్ తో సినిమా చేస్తున్న వైష్ణ‌వ్‌.. ఛ‌లో డైరెక్ట‌ర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడంట వైష్ణ‌వ్‌. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా వైష్ణ‌వ్ నాలుగో సినిమాగా రానుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుందంట‌.