వైష్ణవి చైతన్య క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా కుంభస్థలమే టార్గెట్ ..!

-

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రం బేబీ. ఈ సినిమా ఎంతలా ట్రెండ్ సెట్ చేసింది అంటే యువత మొత్తం ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఫిదా అయ్యారు అని చెప్పాలి. ఇందులో నటీనటులు కూడా పోటీపడి మరీ నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో వైష్ణవి చైతన్య భారీ క్రేజ్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఎంతలా అంటే ఆమె క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అవకాశం లభించేలా చేసిందని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడుగుపెట్టి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ మాత్రమే సక్సెస్ అయ్యే వాళ్ళు .కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్య జనాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కూడా ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి పలు వెబ్ సిరీస్, కవర్ సాంగులు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పుడు బేబీ సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది. ఇదిలా ఉండగా బేబీ సినిమా తర్వాత మరో సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటించలేదు.కానీ ఇప్పటికే అల్లు శిరీస్ తో సినిమాకి కమిట్ అయిందట వైష్ణవి చైతన్య..

అంతే కాదు రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లోను సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలలో ఉన్న హీరో.. వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కావడంతో ఎంకరేజ్ చేయడానికి ఈమెను తీసుకున్నారట. నిజంగానే ఈమెకు ఛాన్స్ వచ్చిందా లేక సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే వైష్ణవి ఏకంగా పాన్ ఇండియా అనే కుంభస్థలాన్ని టార్గెట్ చేసినట్లే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news