ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ..

-

రేసుగుర్రం, టెంపర్, కిక్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ అల్లూ అర్జున్ తో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తాను తీసిన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో వంశీ డీలా పడ్డాడు. ఆ సినిమా వచ్చి మూడేళ్ళ కావస్తోన్న ఇప్పటి వరకూ వంశీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు.

కానీ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజతో చిత్రానికి వంశీ రెడీ అయ్యాడు. వంశీ చెప్పిన అవుట్ అవుట్ యాక్షన్ కథకు రవితేజ ఓకే చెప్పాడట. దీంతో మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. నా పేరు సూర్య సినిమాలో అల్లూ అర్జున్ ని అగ్రెసివ్ గా చూపించిన ఈ డైరెక్టర్ ఈ సారి రవితేజను ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇప్పటికే రవితేజ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో ఈ సినిమా హిట్ అవడం ఇద్దరికీ చాలా అవసరం. అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరు. ఈ సినిమాలో ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తుంది అన్న విషయాలు ఇంకా తెలియలేదు. ఈ సినిమా పట్టాలెప్పుడెక్కుంతుంది అన్న విషయం కూడా ఇంకా తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news