Ghani: దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరు’గని’ అంటూ ఆసక్తి రేపుతున్న ‘గని సాంగ్ ప్రోమో

-

Ghani: బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దూసుక‌పోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ తేజ్ తాజాగా మ‌రో ప్ర‌యోగానికి సిద్ద‌మ‌య్యాడు. వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ ‘గని’ ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకర్షించారు. ‘దేకో హిం గని.. కనివిని ఎరుగని’ అంటూ దుమ్ము రేపుతుంది. పూర్తి పాటను రేపు (బుధవారం) ఉదయం 11.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. వరుణ్ తేజ్ మేకోవర్ ఈ సాంగ్ పట్ల ఆసక్తి పెంచేశాయి.

ఇక ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ విష‌యం తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ తేజ్ సూపర్ హిట్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ లుక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ జంట‌గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. జిమ్ములో తెగ కష్టపడి బాడీ బిల్డ్ చేసి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోబోతున్నారు. ఇటీవలే విడుదలైన ‘గని ఫస్ట్ పంచ్’ గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news