నాగ్‌కు పోటీగా రంగంలోకి వెంక‌టేష్‌, రానా!

కింగ్ నాగార్జున బిగ్బాస్ రియాలిటీ షోతో ఎంట‌ర్‌టైన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో బాబాయ్ అబ్బాయ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా ద‌గ్గుబాటి కూడా ఓ రియాలిటీ షోతో రాబోతున్నారు. తొలిసారి వెంక‌టేష్ హోస్ట్‌గా రాన‌పాతో క‌లిసి స్టేజ్‌ని షేర్ చేసుకోబోతున్నారు. రానా హోస్ట్ చేసిన నెం .1 యారి మంచి పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే.

ఈ షోని అత్య‌ధిక భాగం రామానాయుడు స్టూడ‌యోస్‌లోని ఫ్లోర్‌లో ప్ర‌త్యేకంగా షూట్ చేశారు. ఈ షోలో రానా, వెంక‌టేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ షో చేస్తే ఎలా వుంటుంది.. ర‌చ్చే క‌దూ.. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది. ద‌ని కోసం టెస్ట్ షూట్ కూడా చేసారు. మెయిన్ షూట్ కోసం రానా, వెంక‌టేష్ సన్నద్ధమవుతున్నారు.

ఈ షో స్టార్ మాలో ప్ర‌సారం కానుంద‌ట‌. ఇందు కోసం బాబాయ్‌, అబ్బాయ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నార‌ట‌. విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` చిత్రంలో న‌టిస్తున్నారు. `ఎఫ్ 3` లోనూ న‌టించ‌బోతున్నారు. రానా త‌ను న‌టిస్తున్న `విరాట‌ప‌ర్వం`ని పూర్తి చేసే ప‌నిలో వున్నారు.