మనుషుల్లోనే కాదు… పక్షుల్లో కూడా థర్డ్ జెండర్ ?

-

ప్రకృతి అంటేనే అనేక అధ్బుతాలకు నెలవు, ఇక్కడ ఎన్ని ఎన్ని వింతలు ఉంటాయో ఊహించడం కష్టం. మనకి చాలా తెలియని అంశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇలాంటి విషయాలు మనకి తెలిసినప్పుడు ఔరా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా మనుషుల్లోనే కాదు… పక్షుల్లో కూడా సగం మగ, సగం ఆడ ఉంటాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ కోవకు చెందిన పక్షి ఒకటి అమెరికాలోని ఇల్లినాయిస్‌ లో కనిపిచింది. నార్తన్‌ కార్డినల్‌ పక్షుల్లో మగది ఎరుపు రంగులో ఉంటే ఆడది బూడిద రంగులో ఉంటుంది. కానీ… ఇల్లినాయిస్‌లో కనిపించిన నార్తన్‌ కార్డినల్‌ పక్షి ఓ వైపు ఎరుపు, మరోవైపు బూడిద రంగులో ఉంది. సాధారణంగా  ఈ పక్షుల్లో మగవి కూస్తూ ఉంటాయి. కానీ. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ పక్షి మాత్రం కూయడం లేదు. అంతే కాదు దానికి జంట పక్షి కూడా లేదు. బైలేటర్ల గైనాండ్రో మార్ఫిజమ్‌ వల్ల ఈ పక్షిలో ఆడ-మగ లక్షణాలు రెండూ ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news