విక్టరీ వెంకటేష్… శేఖర్ కమ్ముల కాంబినేషన్..! ఫీల్ గుడ్ కథ కు శ్రీకారం…!

-

Venkatesh to team up with shekhar kammula
Venkatesh to team up with shekhar kammula

ఫీల్ గుడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయనది సున్నితమైన శైలి.. ఆహ్లాదకర కథలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటాడు. ఇప్పటికే హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి సినిమాలతో మనని ఎంతగానో అలరించాడు. ఇక ఇప్పుడు ఈయన మన అందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ తో జత కట్టనున్నాడు. శేఖర్ చెప్పిన కథ వెంకటేష్ కు ఎంతగానో నచ్చిందట ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు ఫిలిమ్ నగర్ టాక్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గనుక సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం..! ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో తమిళ సినిమా రీమేక్ చేస్తున్నాడు ఆ సినిమా కు నారప్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక శేఖర్ కమ్ముల నాగ చైతన్య శాయి పల్లవి లతో  ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని చేస్తున్నారు. ఇద్దరి సినిమాలు పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది. అధికారిక ప్రకటన గురించి ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version