వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసితో..!!

-

సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్  ది ఒక ప్రత్యేక స్థానం. తన సినిమాలు అన్నీ మినిమం గ్యారెంటీ గా ఉంటాయి. ఇక తాను హీరో అన్న మాటే గాని అయన చాలా సింపుల్ బిహేవియర్ కలిగి ఉంటారు. ఆయన తో మాట్లాడితే ఆధ్యాత్మిక గురువు లా మారి మన మనసు ను ఆహ్లాకరమైన స్థానం గా మారుస్తారు. సీనియర్ హీరోలలో హీరోయిజం పాత్రలు వదిలి పెట్టిన వారిలో మొదటి హీరో వెంకటేష్. 

ప్రస్తుతం కథ డిమాండ్ ప్రకారం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంకటేష్ తాజాగా తన 75వ మూవీని `హిట్` సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా `హిట్ 2` తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను హీరో విక్టరీ వెంకటేష్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ కు రెడీ అయ్యారు . వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.

నిహారిక ఎంటర్టైన్‌మెంట్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేకర్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చారు. వెంకీ 75 వ చిత్రం యొక్క గ్లింప్స్ ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు. నిర్మాత సురేష్ బాబు కథ ను ఒక పట్టాన ఒప్పుకునే రకం కాదు, అందుకే స్టోరీ సూపర్ గా వచ్చే దాకా శైలేష్ కొలనుతో చాలా సార్లు చర్చలు జరిపారు. ఇక ఇది వెంకీ కెరియర్ లో 75 చిత్రం కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news