కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్..?

-

కాల్పులు ప్రారంభించింది పాకిస్థాన్. సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులు ఇస్తోందని వెల్లడించారు భారత సైనిక వర్గాలు.

Pakistan started firing

కాల్పుల విరమణ అమలులో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక అటు బార్డర్ దాటిన భారత జవాన్ ను .. బంధించింది పాకిస్తాన్. ఫిరోజ్‌పూర్‌లో అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్ళాడు ఒక భారత సైనికుడు. దింతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ రేంజర్లు. 182వ బెటాలియన్‌కు చెందిన పికె సింగ్ అనే బిఎస్‌ఎఫ్ జవాన్ తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది పాక్ ఆర్మీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news