వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్‌

-

ఎఫ్‌2 బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విక్టరీ వెంకటేష్‌ నటించబోతున్న మరో మల్టిస్టారర్ చిత్రం వెంకీమామ. బాబీ దర్శకత్వంలో వెంకటేష్‌, నాగచైతన్య కాంబినేషన్‌ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ సరసన బాలీవుడ్ హోరోయిన్‌ హుమా ఖురేషి, నాగ చైతన్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయకలుగా నటించనున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, కోన కార్పోరేష‌న్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించనున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ లో విడుదల అంటే… కాదు డిసెంబర్ లో అని కొంతమంది….కాదు సంక్రాంతికి విడుదల అని మరికొంతమంది ఇలా…. రకరకాల వార్తలతో వెంకీ మామ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే….

ఈ క్రేజీ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయాలనీ అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసి నాగ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. కారణం… ఈ సినిమాని సంక్రాంతికి వస్తుందని, మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశపడ్డారు. ఇప్పుడు సంక్రాంతికిర విడుద‌ల‌ అవడం లేదని తెలిసి డీలా అయ్యారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version