రివ్యూ: వెంకీ మామ‌

-

బ్యాన‌ర్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి
ద‌ర్శ‌క‌త్వం:  కేఎస్‌.ర‌వీంద్ర (బాబి)
సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ
ర‌న్ టైం: 149 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 13 డిసెంబ‌ర్‌, 2019
రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లయినా విక్ట‌రీ వెంక‌టేష్ – యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యలు కలిసి మొదటిసారి వెండితెర మీద క‌నిపించిన సినిమా వెంకీ మామ‌. క్రేజీ మల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో చైతు స‌ర‌స‌న రాశీఖ‌న్నా- వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా, కెఎస్ రవీంద్ర ఆలియాస్ బాబీ డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల హై డ్రామా తర్వాత వెంకటేష్ బర్త్ డే కానుకగా నేడు అనగా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మామ అల్లుళ్ళ ఆన్ స్క్రీన్ అల్లరి ఎంత వరకూ ఆకట్టుకుందో మ‌నంలోకం స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ‌లోకి వెళ‌దాం….
జాతకాల్ని బలంగా నమ్మే ఊరి పెద్ద నాజర్ కి ఇద్దరు సంతానం. నాజ‌ర్ వ‌ద్ద‌ని చెప్పినా కుమార్తె ల‌వ్ మ్యారేజ్ చేసుకుని చ‌నిపోతుంది. ఆమె కుమారుడు కార్తీక్ (నాగ‌చైత‌న్య‌)ను పెంచే బాధ్య‌త తీసుకున్న మేన‌మామ వెంకీ (వెంక‌టేష్‌) అల్లారు ముద్దుగా పెంచుతాడు. చివ‌ర‌కు వారిద్ద‌రు ఒకే టైంలో ప్రేమ‌లో ప‌డ‌తారు. వెంకీ ఆ ఊరి స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)తో ప్రేమలో పడితే, కార్తీక్ ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు హారిక (రాశీ ఖన్నా)తో ప్రేమలో పడతాడు. ఆ టైంలో ఇద్ద‌రి మ‌ధ్య అపార్థాలు రావ‌డంతో కార్తీక్ మేన‌మామ వెంకీని వ‌దిలేసి మిల‌ట‌రీకి వెళ్లిపోతాడు. అక్క‌డ నుంచి మేన‌మామ, మేనళ్లుడు క‌థ ఏమైంది ?  వీరి ప్రేమ‌లు ఏమ‌య్యాయి ?  మ‌ళ్లీ వీళ్లిద్ద‌రు ఎప్పుడు క‌లిశారు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
నటీనటుల విషయానికొస్తే వెంకీమామ అనే టైటిల్ కు….నిజజీవితంలో కూడా మేనమామ-మేనల్లుడు అయిన వెంకటేష్-నాగచైతన్యలు తమ క్యారక్టర్లలో పరకాయప్రవేశం చేశారు. ఈ ఇద్దరు సినిమాని తమ భుజాల మీద నడిపించారు. వెంకీ తనదైన స్టైల్లో నవ్విస్తే….చైతూ రొమాంటిక్ అల్లుడుగా అలరించాడు. అసలు ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకులకు కనువిందు కలిగించింది. ఇద్దరు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక వీరికి పెయిర్స్ గా నటించిన పాయల్, రాశి ఖన్నాలు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక వెంకీ-పాయల్, చైతూ-రాశి జోడిల మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. హీరోయిన్స్ రాశీ ఖన్నా – పాయల్ రాజ్ పుత్ లు ఉన్నంతలో బాగా చేశారు. ఇద్దరి గ్లామర్ కూడా బి, సి సెంటర్ ఆడియన్స్ కి అట్రాక్షన్ గా అనిపిస్తుంది.

అటు ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేశ్ లాంటి సీనియర్ నటులు ఉన్నంత వరకు మెప్పించారు. ఇక సినిమాలో కామెడీ సీన్స్ ప్రేక్షకులని బాగా నవ్విస్తాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకీ-చైతూల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల మదిని కదిలించే విధంగా ఉంటాయి. ఇక సంగీతం విషయానికొస్తే థమన్ పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోరు కూడా చాలా బాగా వచ్చింది. ఎలాగో సొంత ప్రొడక్షన్ కాబట్టి నిర్మాణ విలువులు చాలా క్వాలిటీ ఉన్నాయి.

అయితే అంతా బాగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం డల్ గా అనిపించింది. డైరెక్టర్ బాబీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ పెట్టడం వల్ల సగటు ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. మల్టీ స్టారర్ అంటే ప్రేక్షకులకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అయితే బాబీ వెంకిమామ సినిమా అందించలేకపోయారు. ఇక సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యేది మాత్రం వెంకీ-చైతూల నటన…కామెడీ సీన్స్. కానీ స్క్రీన్ ప్లే సరిగా రన్ చేయలేకపోవడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ పెట్టడం పెద్ద మైనస్.

ఇక బాబి డైరెక్ష‌న్ చూస్తే…
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూపించేసిన ఎమోషన్ కి మల్లి కలర్స్ అద్ది చూపించాలని ప్రయత్నించినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇద్ద‌రు మంచి న‌టుల‌ను పెట్టిన బాబి… మంచి మ‌ల్టీస్టార‌ర్‌గా ఈ సినిమాను తీసే అవ‌కాశం ఉన్నా దానిని స‌రిగా వాడుకోలేదు. ఎమోషన్ పాతదైనా దాని ట్రీట్మెంట్ కొత్తగా రాసుకోకపోగా, మరీ బోరింగ్ అండ్ పాత చితకాయపచ్చడి స్టైల్ కామెడీ, ఎమోషన్ రాసుకోవడంతో సెకండాఫ్ మ‌రీ బోరింగ్‌గా మారింది. మామ‌, అల్లుడు విడిపోవ‌డానికి కార‌ణ‌మైన స‌మ‌స్య‌లు చాలా రెగ్యుల‌ర్‌గా ఉంటాయి. ఫ‌స్టాఫ్‌లో కామెడీ, రొమాంటిక్ ట్రాక్‌తో బండి బాగానే న‌డిచినా సెకండాఫ్‌లో మాత్రం స్లో నెరేష‌న్‌, బోరింగ్ సీన్ల‌తో సినిమా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కొంత వ‌ర‌కు ఆద‌రించ‌వ‌చ్చు.

ఫైన‌ల్‌గా…
మామ అళ్లుల్ల మంచి కాంబినేష‌న్ తెర‌పై క‌నెక్ట్ అవ్వ‌లేదే…?

వెంకీ మామ రేటింగ్‌: 2.5 / 5

Read more RELATED
Recommended to you

Latest news