Venu Swamy : బిగ్‌బాస్‌ షో అదో చెత్త షో.. ఆ షోకి వెళ్తే అంతే స‌ర్వ‌నాశ‌న‌మే వేణుస్వామి

-

Venu Swamy : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 త్వ‌ర‌లో రాబోతోంది. అన్ని బాష‌ల్లో సూప‌ర్ హిట్ అయిన బిగ్‌బాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌నూ అల‌రిస్తుంది. బిగ్‌బాస్ తొలి సీజ‌న్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, రెండ‌వ సీజ‌న్‌ను హీరో నానీ న‌డిపించాడు. మిగిలిన సీజ‌న్‌ల‌న్నింటినీ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నాడు. సీజ‌న్ 8కు కూగా నాగార్జున హోస్ట్ చెయనున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన బిగ్‌బాస్‌8 లోగోను అక్కినేని నాగార్జున రివీల్ చేశాడు.

venu swamy
venu swamy

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో బిగ్‌బాస్ 8 కంటెస్టంట్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు మీడియా స‌ర్కిల్స్‌లో, నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎవ‌రికి తోచిన పేర్లు వారు ప్ర‌చారం చేస్తున్నారు. అందులో కొస‌మెరుపేంటంటే ప్ర‌ముఖ అస్ట్రాలజర్ వేణు స్వామి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నారంటూ ఆయ‌న పేరును జోడించారు. అంతేనా భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లుగా ఇంతా, అంతా అంటూ ఊద‌ర‌కొడుతున్నారు. అయితే ఇదే విష‌యంపై వేణు స్వామి ఒక ఇంట‌ర్వ్యూలో స్పందించారు.

ఏంటి గురువుగారు మీరు బిగ్ బాస్ షోకి వెళ్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిజ‌మేనా అంటూ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు వేణు స్వామి సింపుల్‌గా నో చెబితే ఆశ్చ్య‌ర్య‌పోయేవాళ్ళం.. త‌న స్టైల్లో జ‌వాబిచ్చారు స్వామి వారు. బిగ్ బాస్ షో అదో చెత్త షో, రెండు సార్లు షోలో పాల్గొన‌మంటూ ఆఫ‌ర్ ఇచ్చారు. కానీ నేను రిజెక్ట్ చేశాను. ఆ షోలో ఇప్ప‌డు కాదు ఎప్ప‌టికీ పాల్గొనను, దానికి నేను పూర్తి వ్య‌తిరేకం అంటూ చెప్పారు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళి విన్న‌ర్‌గా గెలిచిన వారు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తారు, ఆ షోకి వెళ్ళిన వారి జీవితాలు నాశ‌నం అవుతాయి వెళ్ళ‌వ‌ద్ద‌ని నేనే అంద‌రికీ చెప్తా, అలాంటిది నేను ఆ షోకి వెళ్లండం ఎంటంటూ ప్ర‌శ్నించారు.

బిగ్‌బాస్ అగ్రిమెంట్ ప్ర‌కారం వెళ్ళే ముందు రివీల్ చెయ్య‌వ‌ద్దు అందుకే స్వామి గారు చెప్ప‌టం లేదంటూ నెటిజ‌న్ కామెంట్స్ చేస్తున్నారు. అయ్యా బాబూ నేను వెళ్ళ‌టం లేద‌న్నా కూడా విన‌ట్లేదు నెట్టింట‌. మీరు వెళ్తే గెల‌వ‌ర‌ని మీ జాత‌కంలో ఉందా ఏంటీ?? ఎలాగూ మీరు చెప్పే జాత‌కాలు నిజం కావులే వెళ్ళ‌వ‌చ్చంటూ చ‌మ‌క్కులు వ‌దులుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news