ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

-

కర్నాడ్‌ను 1974లో జ్ఞాన్‌పీఠ్, పద్మశ్రీ అవార్డులు వరించాయి. 1992లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది.

బెంగళూరు ప్రముఖ నటుడు, నాటక రచయిత, దర్శకుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. బెంగళూరులోని ఆయన నివాసంలో గిరీశ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ కన్నుమూశారు. ఆయన పలు భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించారు.

కర్నాడ్‌ను 1974లో జ్ఞాన్‌పీఠ్, పద్మశ్రీ అవార్డులు వరించాయి. 1992లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది.

1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఫిలాసఫీ, పొలిటికల్‌సైన్స్, ఎకనామిక్స్ మీద మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేశారు.

ఆయన కన్నడలో రాసిన పలు నాటకాలు ఇంగ్లీష్, ఇతర భాషల్లోకి అనువదించబడేవి. 1970లో సంస్కార అనే కన్నడ సినిమాతో తన సినిమా కెరీర్‌ను కర్నాడ్ ప్రారంభించారు. అదే సినిమాకు రచయితగానూ పనిచేశారు. ఆసినిమాకు ఆయన మొదటి రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ అవార్డును సాధించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి తండ్రిగా నటించి అందరినీ మెప్పించారు.

గిరీశ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ట్విట్టర్‌లో ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news