BREAKING : బిచ్చగాడు హీరో విజయ్ కూతురు ఆత్మహత్య

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది వివిధ కారణాలవల్ల ప్రముఖ నటులు మరియు నటీమణులు మరణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా ప్రారంభం నుంచి చాలామంది ప్రముఖ నటీనటులు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Vijay Antony Daughter died by suicide
Vijay Antony Daughter died by suicide

అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె ఉరేసుకుని చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఒత్తిడి కారణంగానే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ” బిచ్చగాడు” సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ చిత్రం తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ వస్తుంది. ఇక ఇవాళ బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఉరేసుకుని మరణించడం తో ఆయన కుటుంబం విషాదం లోకి వెళ్ళింది.