Hatya : OTTలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..ఎందులో స్ట్రీమింగ్‌ అంటే ?

-

” బిచ్చగాడు” సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ చిత్రం తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ వస్తుంది. ఇక బిచ్చగాడు-2 లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటించిన మూవీ ‘హత్య’. భారీ అంచనాలతో గత నెల 21న విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది.

దీంతో నెలలోపే ఓటీటీలోకి రానుంది. ఈనెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాకు కమల్ బోరా, జి ధనంజయ్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరై, సింగం పిల్లై, సిద్ధార్థ శంకర్, ఆర్విఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దశకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news