అవకాశాలు లేక అందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు అందరూ. ఇందులో ప్రీతి పాత్రలో ఎంత అద్భుతంగా నటించింది షాలిని పాండే. ఇక తన అమాయకపు చూపులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయారు కానీ ఈ ముద్దుగుమ్మ కెరియర్ మాత్రం ఆమెకు భిన్నంగా మారిపోయింది.షాలిని పాండే తెలుగులో పాటు మలయాళం తమిళ్ వంటి భాషలలో కూడా నటించిన ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోతోంది.

దీంతో షాలిని పాండే కెరియర్ ఇప్పుడు చాలా స్లోగా అయిపోయిందని చెప్పవచ్చు. ఆఫర్లు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో అయితే ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కెరియర్ పరంగా కాస్త బొద్దుగా ఉన్నందువలన ఈమెకు అవకాశాలు రాలేదని ఆమె భావించడంతో ఈ మధ్యకాలంలోనే చాలా స్లిమ్ గా మారిపోయిన ఫోటోలు కూడా షేర్ చేసింది.అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సమయంలోనే షాలిని పాండే గురించి ఒక ప్రత్యేకమైన న్యూస్ వైరల్ గా మారుతోంది.


అదేమిటంటే ఆఫర్లు లేక ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చేసే దానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అది కూడా విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ 23న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రంలోనే షాలిని పాండే ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం ఆమెకు అవకాశం కోసం విజయ్ దేవరకొండనే స్వయంగా రికమండేషన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version