టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఆసుపత్రి పాలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవాళ టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండకు తీవ్ర అస్వస్థత నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది.

దీంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజయ్ దేవరకొండ ను అడ్మిట్ చేశారట. మూడు రోజులపాటు ఆసుపత్రిలోనే విజయ్ దేవరకొండ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈనెల 20వ తేదీన డిశ్చార్జ్ చేస్తారని కూడా చెబుతున్నారు. కింగ్డమ్ సినిమా సందర్భంగా నే ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.