రౌడీ `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

-

సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌ లెవల్‌కు వెళ్లాయి. ఈ అంచనాలకు తోడు హీరోతో నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే శుక్రవారం(నేడు) సాయంత్రం 4:05 గంటలకు చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇక అనుకుట్టుగానే సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌. ఈ టీజ‌ర్ చూస్తుంటే నాలుగు ల‌వ్‌ స్టోరీల‌తో.. అనేక ట్విస్టుల‌తో ద‌ర్శ‌కుడు రూపొందించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మళ్లీ విజయ్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతున్న‌ట్టు టీజ‌ర్ చూస్తేనే తెలుస్తోంది. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news