సీఎం జగన్ కు బోస్టన్ కమిటీ నివేదిక అందజేసిన ప్రతినిధులు..

-

ఏపీ అభివృద్ధి, రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను సీఎం జగన్ కు బోస్టన్ కమిటీ ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఈ నివేదికలోని వివరాలను జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు వివరించారు. కాగా.. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనున్నది.

హైపవర్‌ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత హైపవర్‌ కమిటీ తన నివేదికను సీఎంకు సమర్పించనుందని సమాచారం. అనంతరం దానిపై కేబినెట్‌లో చర్చించి.. శాసనసభ సమావేశం ఏర్పాటుచేసి.. అక్కడ ఆమోదింపజేసుకుంటారని అంటున్నారు. ఇంకోవైపు.. 8వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news