సమంతపై విజయ్ దేవరకొండ ఎమోషనల్ నోట్..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. జీవితంలో ఇప్పటి వరకు ఎంతో పోరాటం చేస్తున్నావు సామ్ నీకు అంతా మంచే జరుగుతుంది అంటూ చెప్పుకు వచ్చారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైన సందర్భంగా టాలీవుడ్ తారలు సమంతకు, ‘శాకుంతలం’ టీమ్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయదేవరకొండ సామ్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

article_image2

సమంత పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ.. “సామ్.. నువ్వు ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ సరైన పనిచేస్తుంటావు. ఉత్సాహంగానూ ఉంటారు. ఇప్పటికీ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. దానిపైనే నీ కేరీర్ ఆధారపడి ఉంది. కానీ ఏడాదిగా నువ్వు జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో ఎవరికీ తెలియకపోవవ్చు. అయినా ఎప్పుడూ నవ్వుతూ, సినిమాల కోసం ముందడు వేస్తూనే ఉన్నావు. నీ శరీరం విశ్రాంతి తీసుకోమని చెబుతున్నా.. పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా ముందుకెళ్తూనే ఉన్నావు. ఇలాంటి తరుణంలో విడుదలవుతున్న ‘శాకుంతలం’ విజయంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్..” అంటూ రాసుకొచ్చారు.

article_image5ఈ నోట్ పై స్పందించిన సామ్.. “ఇలాంటి సమయంలో నాకు కావాల్సింది ఇదే. మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్యూ మై హీరో..” అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news