ఫ్యాన్స్ కి చురకలంటించిన విజయ్ – తమన్నా..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత దశాబ్ద కాలంగా గ్లామర్ తో, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అదే హవా కొనసాగిస్తుంది అంటే ఇక ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిల్క్ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరిచిపోయే అభిమానులు చాలామంది ఉన్నారని చెప్పాలి.

తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. హ్యాపీడేస్ చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఒకరకంగా చెప్పాలి అంటే టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ట్రెండీ లుక్ తో నెటిజన్లను సర్ప్రైజ్ చేస్తూ ఉండే ఈమె గత కొద్ది రోజులుగా తన ప్రేమ వ్యవహారంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడగా.. అతనితో ప్రేమలో ఉన్నట్లు తమన్నా కూడా ఓపెన్ గానే చెప్పేసింది.

ఇక తాజాగా ఈ జంట మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. తమన్నా మాల్దీవుల నుంచి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ కాగా.. అందులో తన ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా కలిసి ఉన్న ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు. తాజాగా వీరిద్దరూ వెకేషన్ ముగించుకొని ఎయిర్ పోర్ట్ లో విడివిడిగా కనిపించారు. దీంతో మీడియా అభిమానులు తమన్న, విజయ్ వర్మ వెంట పడ్డారని చెప్పాలి. తమన్న మెరూన్ కలర్.. బ్రా లాంటి డ్రెస్ లో అందాలను వెదజల్లుతూ మరొకసారి కుర్రకారులను మెస్మరైజ్ చేసింది . ఇదిలా ఉండగా తమన్నను చూసిన అభిమానులు మాల్దీవుల వెకేషన్ ఎలా ముగిసింది? విజయ్ సార్ రాలేదా? అంటూ ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక ఇదే ప్రశ్నను విజయ్ వర్మను కూడా అడగుతూ.. మాల్దీవుల్లో బాగా మజా చేశారా..? అంటూ ఎయిర్పోర్ట్లో ఒక అభిమాని అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ వర్మ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ? ఇలాంటివి మాట్లాడకూడదు అని తెలియదా? అంటూ కోపం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

Read more RELATED
Recommended to you

Latest news