తమన్నా, విజయవర్మ ప్రేమలో పడ్డారని గత కొంతకాలంగా వార్తలు కోడైకూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఎక్కడ చూసినా జంటగా కనిపించడంతోపాటు సన్నిహితంగా కూడా మెలుగుతూ ఉంటారు. మొత్తానికి అయితే వీరిద్దరూ ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారని చెప్పాలి. అవును విజయ వర్మతో నా రిలేషన్ నిజమే అంటూ కుండబద్దలు కొట్టిన తమన్నా లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైంది అని, కేవలం సహనటుడు అన్న కారణంగానే ఆయనను ఇష్టపడలేదు అని.. చాలామంది హీరోలతో పని చేసిన విజయవర్మ చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.
తనకోసం తాను సృష్టించుకున్న అందమైన ప్రపంచంలోకి విజయ వర్మ వచ్చాడు. అతను ఉన్న ప్రదేశమే తనకు ఇష్టమైన ప్రదేశం అంటూ తమన్న తెలిపింది. ఇప్పుడు తాజాగా విజయవర్మ కూడా ఒప్పుకున్నారు. అలాగే తమ బంధాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో కూడా తెలిపారు. పబ్లిక్ కి నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పాలి అనుకున్నాను. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేయాలి అని.. అందుకే తమన్నాతో ప్రేమ విషయం బయట పెట్టలేదు అని తెలిపారు.
దీంతో విజయవర్మ తమన్నాల బంధం పై ముసుగు కూడా తొలగిపోయిన నిజంగానే వారిద్దరు డేటింగ్ చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా వచ్చేసింది. లస్ట్ స్టోరీస్ సీజన్ టు జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తమన్నా , కాజల్ అగర్వాల్, మృనాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి అయితే తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందరికీ క్లారిటీ ఇచ్చారు ఈ జంట.