విజయనిర్మల తన భర్తను కాదని కృష్ణ ని వివాహం చేసుకోవడానికి కారణం..?

-

దివంగత నటి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విజయనిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే 1946 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించిన ఈమె తమిళ్లో ఎంగ వీటు పిళ్ళై అనే సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక ఈ చిత్రానికి విజయ ప్రొడక్షన్ వారు నిర్మాత బాధ్యతలు చేపట్టడం, ఆమె మొదటి సినిమా కూడా అదే అవడం గమనార్హం.

అప్పటికే నిర్మలమ్మ అనే నటి ఇండస్ట్రీలో ఉండడంతో ఆమె ముందు పేరును విజయ అని జత చేశారు. అప్పటినుంచి విజయనిర్మలగా చలామణి అయ్యారు. తెలుగులో ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన ఈమె తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇంకా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన నటీమణిగా గిన్నీస్ రికార్డు కూడా సృష్టించారు. ఇలా ఉండగా విజయనిర్మల మొదటి భర్త ఉండగానే కృష్ణ ను రెండవ వివాహం చేసుకోవడం వెనుక గల కారణం కూడా ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

విజయనిర్మల హీరో కృష్ణకి రెండవ భార్యగా బాగా పాపులర్ దక్కించుకుంది. కానీ ఆమెకు కృష్ణ కంటే ముందు కృష్ణమూర్తి అనే ఆయనతో వివాహం జరిగింది. అతడు షిప్ డిజైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ఇక వీరిద్దరికీ పుట్టిన సంతానమే నరేష్.. ప్రస్తుతం నరేష్ సినిమాలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే నరేష్ పుట్టాక కూడా కొన్ని సంవత్సరాలు పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అయితే సినిమాల మీద ఇష్టం.. హీరోయిన్ కావాలన్నా కోరిక రెండు కూడా ఇద్దరి మధ్య విభేదాలకు కారణం అయ్యింది. ఇకపోతే మరొకవైపు కృష్ణతో ఎక్కువ సినిమాలలో నటించేసరికి ఆయన పైన పెరిగిన ఇష్టం కారణంగా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను వివాహం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news