తమన్నాతో పెళ్లిపై విజయ్‌వర్మ హాట్ కామెంట్స్

-

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా .. తెలుగుతోపాటు తమిళ , హిందీ భాషల్లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తమన్నా, నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే.. తాజాగా తమన్నాపై ప్రేమ గురించి విజయ్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ కమ్యూనిటీలో 16 ఏళ్లకే అబ్బాయిలకు పెళ్లి చేస్తారని నటుడు విజయ్ వర్మ తెలిపారు. దీంతో త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి ఒత్తిడి పెరిగిందని చెప్పారు. అమ్మ ఫోన్ చేసిన ప్రతిసారి పెళ్లి గురించే మాట్లాడుతుందని, దీంతో మాట దాటేస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి ఉందన్నారు. కాగా, తాము ప్రేమించుకుంటున్నామని తమన్నా-విజయవర్మ వెల్లడించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version