`ప్రేమదేశం`హీరో అబ్బాస్ మిస్సింగ్.. ఎక్క‌డంటే..

-

`ప్రేమ దేశం` 1996లో తెలుగులో విడుద‌ల అయింది. ఈ సినిమాలో హీరోలుగా అబ్బాస్‌, వినీత్.. హీరోయిన్‌గా ట‌బు న‌టించారు. ఈ చిత్రం అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. కదిర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.టి.కుంజుమోన్ ఈ సినిమాను నిర్మించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో అప్పట్లో దక్షిణాదిలో క్రేజీ ఆల్బమ్. అలాగే ఈ సినిమాతో వినీత్‌, అబ్బాస్‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రేమదేశం కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అబ్బాస్ ఎక్క‌డ ఉంటున్నారు? ఏం చేస్తున్నాడు? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెట్టాడు వినీత్‌.

అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో వున్నాడని.. అక్కడే కుటుంబంతో సెటిలయ్యాడని తెలిపారు. అప్పుడప్పుడు ఫేస్ బుక్ లో తనకు టచ్ లో వుంటున్నాడని వెల్లడించారు. వాస్త‌వానికి అబ్బాస్ కి ఇదే మొద‌టి సినిమా. ఇలాంటి క్రేజీ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కోల్ కతా కుర్రాడు అబ్బాస్ ఓవర్ నైట్ లోనే హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుని పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకోలేకపోయాడు. 2016లో అబ్బాస్ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు. ప్ర‌స్తుతం అబ్బాస్ న్యూజిలాండ్‌లో ఉంటున్న‌ట్టు వినీత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news