బిగ్‌బాస్ 3 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన వితిక‌

-

బిగ్‌బాస్ షో ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చేసింది. వ‌చ్చే వీకెండ్‌తో ఈ షో ముగియ‌నుంది. మొత్తం 15 వారాల పాటు కొన‌సాగిన ఈ షో ఫైన‌ల్లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు చాంపియ‌న్ కోసం పోటీ ప‌డుతున్నారు. ఇక బిగ్‌బాస్ షోలో చివ‌రి వారాల వ‌ర‌కు ఉన్న హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితిక షెరు ఎవ‌రు గెలుస్తారో చెప్పేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో విజయం సాధించబోయేది తన భర్తేనని వరుణ్ సందేశ్ భార్య వితికా  బల్లగుద్ది మరీ చెబుతోంది.

రెండు వారాల క్రితం వరకూ భర్తతో హౌస్ లోనే కంటెస్టెంట్ గా ఉన్న వితిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం వితిక బిగ్‌బాస్ అనుభ‌వాల‌ను మీడియాతో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె మాట్లాడుతూ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న స‌మ‌యంలో త‌నకు ఓపిక విలువ ఏంటో తెలిసి వ‌చ్చింద‌ని చెప్పింది. త‌న‌కు ఏ టాస్క్ ఇచ్చినా కూడా త‌న భ‌ర్త వ‌రుణ్ కంటే తాను బాగా ఆడాన‌ని కూడా చెప్పుకొచ్చింది.

ఇక గూగుల్ చూడ‌కుండా.. ఒక‌రి సాయం లేకుండా కూడా ఎలా బ‌త‌కాలో హౌస్‌లో ఉంటేనే తెలిసింద‌న్న వితిక పలు టాస్క్ లను మైండ్ తో ఆడటంతో విజ్ఞానం పెరిగిందని చెప్పింది. ఇక హౌస్‌లో ఆరు వారాల పాటు కిచెన్ కెప్టెన్‌గా కూడా ఉన్నాన‌ని గుర్తు చేసిన ఆమె వ‌రుణ్ గెలిస్తే త‌మ‌కు ల‌భించే రు.50 ల‌క్ష‌ల‌ను చాలా భ‌ద్రంగా దాచుకుంటామ‌ని చెప్పింది. ఇక పెళ్లి త‌ర్వాత మూడేళ్ల పాటు ఎన్నో బాధ‌లు అనుభ‌వించినందున ఆ మొత్తంతో తాము ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటామ‌ని చెప్పింది.

ఇక బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌లో తన భర్త వరుణ్‌తో పాటు శ్రీముఖి, రాహుల్ ఉండవచ్చని భావిస్తున్నానని వితిక అంచనా వేసింది. బిగ్ బాస్ -3 లో తాను హౌస్‌లో ఉన్న సమయంలో మొత్తం 250 డ్రస్ లను మార్చానని, రోజుకు మూడు డ్రెస్‌లు వేసుకున్న‌ట్టు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version