`మెగాఫ్యామిలీ` సినిమాపై వ‌ర్మ షాకింగ్ ట్వీట్‌..

-

వివాద‌స్పద చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక‌ ఈ ట్రైలర్ వేడి చల్లారకముందే నా తర్వాతి సినిమా టైటిల్ ‘మెగా ఫ్యామిలీ’.. అక్టోబర్ 29 ఉదయం 9:36 నిమిషాలకు వివరాలు వెల్లడిస్తానని ఊదరగొట్టాడు. మెగా ఫ్యామిలీపై సినిమా అంటే ఇంకేం కాంట్రవర్సీకి తెరలేపుతాడోనని.. యాంటీ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్యాచ్, వర్మ ఫ్యాన్స్ అందరూ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

క‌ట్ చేస్తే.. ఆ ప్రాజెక్ట్‌ను తాను చేయాల‌నుకోవ‌డం లేద‌ని తాజాగా ట్వీట్ చేశాడు. అందుకు కార‌ణంగా మెగాఫ్యామిలీ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారికి 39 మంది పిల్ల‌లుంటార‌ట‌. చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండ‌టం, పిల్ల‌లు సినిమాలు తీయ‌డంలో తన‌కు అనుభవం లేక‌పోవ‌డంతో `మెగాఫ్యామిలీ` సినిమాను తెర‌కెక్కించాల‌నుకోవ‌డం లేదన్నాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. దీంతో నెటిజ‌న్లు.. ఇదంతా వర్మ మార్క్ పబ్లిసిటీ స్టంట్ అని, వర్మని నమ్మడం అంత బుద్ధితక్కువ పని మరోటి ఉండదు అంటూ.. రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version