రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ట్రైలర్ వచ్చేసింది

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను RGV రిలీజ్ చేశారు. జగన్ పాదయాత్ర అధికారంలోకి వచ్చేందుకు దారితీసిన పరిస్థితులను వర్మ ఈ సినిమాలో చూపించనున్నారు. నవంబర్ 10న ‘వ్యూహం’ సినిమా రిలీజ్ కానుంది.

VYOOHAM TRAILER
VYOOHAM TRAILER

ఇక ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘వ్యూహం’ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉందన్నారు రామ్‌ గోపాల్‌ వర్మ. వ్యూహం రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల తో ఈ రెండు సినిమాలు ఉంటాయని చెప్పారు. నేను చాలా సౌమ్యుడుని.. ఎప్పుడు చంద్రబాబుని కలవ లేదు.. నాకు వైఎస్‌ జగన్ అంటే ఒక అభిప్రాయం ఉంది.. చంద్రబాబు అంటే ఒక అభిప్రాయం ఉంది.. నిజమనేది ఈ సినిమాలో చూస్తారని తెలిపారు రామ్‌ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news