రష్మిక ఆ స్టార్ హీరో భార్య కావాల్సిందా.. మరి ఏమైందంటే.?

-

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే కొన్ని సినిమాలు చిరస్థాయిగా ప్రేక్షకుల మధిలో నిలిచిపోతాయి. చాలా రియలిస్టిక్ గా ఆహ్లాదకరంగా మన లైఫ్ లో జరిగిన సన్నివేశాలు ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఎప్పటికీ కూడా ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంటాయనడం సందేహం లేదు. అలాంటి చిత్రాలలో మజిలీ కూడా ఒకటి. ప్రముఖ హీరో నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో నటించారు.

వీరిద్దరూ ఎంత సహజంగా నటించారు అంటే తెరపై కనిపించిన ప్రతిసారి అలాగే చూస్తూ ఉండిపోవాలి అనేంతలా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం సమంత , నాగచైతన్య నటన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో సమంత ప్లేస్ లో ముందుగా రష్మిక మందన్న ను డైరెక్టర్ శివ నిర్వాణ అనుకున్నారట. కానీ చాలామంది రష్మిక మందన్న కంటే ఆ పాత్రలో సమంత అయితేనే బాగుంటుందని… రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావడంతో వారిద్దరి మధ్య మరింత కెమిస్ట్రీ పండే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారట.

అందుకే శివానిర్వాన కూడా మరో ఆలోచన చేయకుండా సమంత నాగచైతన్యతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా వాళ్ల సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిందని చెప్పాలి. ఇక అలా రష్మిక తన అవకాశాన్ని కోల్పోయింది. లేకపోయి ఉండి ఉంటే అన్నీ కలిసొచ్చి ఉంటే తప్పకుండా ఈ సినిమాలో నాగచైతన్య భార్య క్యారెక్టర్ లో రష్మిక నటించేది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news