ఎడిట్ నోట్: ఎవరి ‘విజన్’ బెస్ట్?

-

ఒకరిది పేదలకు మంచి చేసే విజన్..మరొకరిది పేదరికం లేకుండా చేయాలనే విజన్..ఇందులో ఎవరిది బెస్ట్ విజన్..అసలు ప్రజలు ఏ విజన్ కోరుకుంటున్నారంటే? దానికి సమాధానం ఎవరైతే మాటలు చెప్పడమే కాదు..చేతల్లో కూడా చూపిస్తారో వారినే ప్రజలు నమ్ముతారు. అంటే ఎన్ని రకాలుగా మాటలు చెప్పి..చేతల్లో చూపించని వారిని నమ్మడం కష్టం. అయితే ఈ విజన్ అనే మాట ఎక్కువగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు వాడుతారు. ఆయన 1995లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విజన్ అంటూ మాట్లాడుతున్నారు. అంటే భవిష్యత్ ప్రణాళికలని వేసుకుని, దాని బట్టి ముందుకెళ్లడం.

అప్పుడే విజన్ 2020 అని బాబు చెప్పుకొచ్చారు. అప్పటికి ఏపీ నెంబర్ 1 అవుతుందనే కాన్సెప్ట్. కానీ బాబు మాటలు చేతల రూపంలో ఎక్కువ కనిపించలేదు. కేవలం బిజినెస్ పరంగా తప్ప..రైతులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడేలా బాబు విజన్ లేదు. దీంతో 2004లో ఆయన్ని గద్దె దింపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ రైతు, పేద, మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేలా చేశారు. అందుకే 2009లో మళ్ళీ గెలిచారు.

ఇక రాష్ట్రం విడిపోయాక 2014లో ఏపీలో మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఈ విజన్ అనే మాట వాడారు. విజన్ 2029 అన్నారు. అప్పటికి దేశంలోనే ఏపీని నెంబర్ 1 గా తీర్చుదిద్దుతామని అన్నారు. కానీ 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయన విజన్‌ని నమ్మలేదు. జగన్‌ని గెలిపించారు. జగన్ ఇంకా పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు.

ఈ సమయంలోనే బాబు విజన్ 2047 అంటున్నారు. దేశమే కాకుండా రాష్ట్రం కూడా 2047కు నెంబర్1 గా ఉండాలని విజన్ రూపొందించానని చెబుతున్నారు. కానీ బాబు విజన్ ప్రజలకు అర్ధం అవ్వని విజన్..జగన్ విజన్..ప్రజలకు అండగా ఉండే విజన్. ఓ వైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే..మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం అసలైన విజన్..అదే జగన్ చేస్తున్నారు. అందుకే ప్రజలు జగన్ విజన్ బెస్ట్ అని భావిస్తున్నారు.   eeee

Read more RELATED
Recommended to you

Latest news