దక్షిణ భారత నటీమణుల సంఘం ( నడిగర్ సంఘం ) 68వ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు తేనాంపేటలోని కామరాజర్ ఆరంగంలో జరిగింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు నాజర్, సంఘం జనరల్ సెక్రటరీ విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు పూచ్చీ మురుగన్, కరుణాస్ సహా ఆ సంఘం ఇతర కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులంతా పాల్గొన్నారు.
ఈ సమావేశం పూర్తయిన అనంతరం సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( నడిగర్ సంఘం ) జనరల్ సెక్రటరీ విశాల్ మాట్లాడుతూ.. కోలీవుడ్ లో మహిళల రక్షణకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదులు అందితే ఎవరి విషయంలోనైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కమిషన్ విషయంలో రోహిణి, సుహాసిని కీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు. సంఘంలో సభ్యత్వం లేని వారు కూడా తాము ఎలాంటి సమస్య ఎదుర్కొన్న ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు విశాల్. సీనియర్ నటులు, కొత్త నటులు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్.. ఇలా ఎంతటి వారైనా సరే ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.