వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం- విజయ్‌

-

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన చేశారు తమిళ స్టార్‌ హీరో విజయ్‌. తమిళనాడులో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళగ వెట్రి కళగం పేరిటా పార్టీ ప్రకటన చేశారు. తమిళనటుడు విజయ్ రాజకీయం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తాజాగా ప్రకటన చేశారు.

We will contest in the next Tamil Nadu assembly elections said Vijay

ఈ సందర్భంగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ మాట్లాడుతూ…సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని చెప్పారు. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు అని వివరించారు. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు విజయం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదన్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన చేశారు సినీ నటుడు విజయ్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news