దక్షిణ మధ్య రైల్వే లో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కీలక ప్రకట చేశారు. ఈ ఏడాది 14,232.84 కోట్లు కేటాయింపు జరిగాయన్నారు. భద్రాచలం రోడ్ డోర్నకల్ మధ్య 54.65 కిలోమీటర్ల డబ్లింగ్ లోనే పనులకు 770.12 కోట్లు, ఔరంగాబాద్ అంకై మధ్య డబ్లింగ్ పనులకు 960.64 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే లో కొత్త ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ ల కింద 1184.14 కోట్ల కేటాయింపు, డబ్లింగ్, థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కింద 2905.91 కోట్లు, విద్యుద్దికరణ లైన్ ల కోసం 225.59 కోట్లు, సిగ్నల్ టెలి కమ్యూనికేషన్ కింద 302.68 కోట్లు, రైల్వే భద్రత పరంగా నిదుల కేటాయింపులు 891.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణకు నిన్నటి బడ్జెట్ లో 5,071 కోట్లు కేటాయింపు చేశామని… ఏపికి 9,138 కోట్లు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.