వామ్మో.. హీరో శింబు స్వార్థానికి బలైన డైరెక్టర్స్ వీళ్లే..!

-

ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి.. 2004లో మన్మధన్ అనే కోలీవుడ్ సినిమాలో నటించి ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఏ.జే.మురుగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక తర్వాత శింబు , మురుగన్ ఇద్దరు కలిసి దాదాపు మూడు సంవత్సరాల పాటు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. అనంతరం ఒక్కసారిగా శింబు అతడి నుంచి విడిపోయి తన దారి తాను చూసుకున్నాడు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన్మధన్ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ఏజే మురుగన్ అందించినప్పటికీ శింబు కోరడంతో ఆ క్రెడిట్ మొత్తం అతనికి ఇచ్చాడు. స్టోరీకి క్రెడిట్ ఇస్తే తాను డబ్బులు ఇస్తానని.. భవిష్యత్తులో చాలా సినిమాలకు అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చాడట శింబు.. కానీ ఆ మాట తప్పి మురుగన్ ను దారుణంగా మోసం చేశాడు. శింబు దెబ్బకు మురుగన్ 14 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోయారు. మురుగన్ మాత్రమే కాదు చాలామంది దర్శకులను వాడుకొని ఆ తర్వాత వదిలేసే ఒక చెడ్డ అలవాటు శింబు కి ఉంది.

తనకోసం తపన పడిన చాలామందితో మొదట్లో చాలా క్లోజ్గా మూవ్ అయిన తర్వాత తన స్వార్థం తాను చూసుకుంటాడు అనే ఒక బ్యాడ్ రూమర్ కూడా శింబు పై ఉంది. ఇకపోతే కొంతమంది డైరెక్టర్లు శింబు నుంచి దూరం వచ్చి సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో పర్వాలేదు కానీ మిగతా వారికి శింబు లైఫ్ ఇవ్వకపోతే వారు శింబు ని నమ్మకద్రోహిగా పరిగణించి తిట్టుకుంటూ ఉంటారు. అలా శింబు వల్ల కెరియర్ నాశనం చేసుకున్న వారిలో మురుగన్ తో పాటు కట్టవన్ దర్శకుడు జి టి నందు, రవిచంద్రన్, బండి సరోజ్ కుమార్ వంటి ఎంతో మంది దర్శకులు ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news