‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్.. యోధుడిగా భయపెట్టిస్తోన్న సూర్య..

-

తమిళ్ హీరోగా సూర్య గుర్తింపు తెచ్చుకున్నా సరే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరో అని చెప్పాలి. తెలుగులో కూడా ఈయన తన సినిమాలను విడుదల చేస్తూ ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు. అంతేకాదు సూర్య నటించే చిత్రాలు ఇక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతూ భారీ విజయాలను అందుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. ఇవాళ సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను యూనిట్ విడుదల చేసింది. దీనిలో సూర్య సరికొత్త పాత్రలో కనిపించారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి… దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news