ఒకప్పుడు తన అంద చందాలతో యువతను బాగా ఆకట్టుకున్న జయప్రద గురించి పరిచయం ప్రత్యేకంగా అక్కర్లేదు. ఏపీలో రాజమండ్రిలో కృష్ణ , నీలవేణి దంపతులకు జన్మించిన ఈమె టాలీవుడ్ తో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం చిత్రాలలో దాదాపు 300కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈమె అసలు పేరు లలితా రాణి.. భూమికోసం అనే సినిమా ద్వారా కెరియర్ను ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా తన పేరును జయప్రదగా మార్చుకుంది.
ఇకపోతే అప్పట్లో జితేంద్ర , రిషి కుమార్ వంటి అగ్ర హీరోలే కాకుండా తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ వంటి హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు అంతలా బిజీగా ఉండేది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పటి స్టార్ హీరోలు అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. 1986 ఫిబ్రవరి 22న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే శ్రీకాంతకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం పలు సంచలనాలకు దారి తీసింది.
అయితే జయప్రద ను వివాహం చేసుకున్నా కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతో మూడో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకొని 1990లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది జయప్రద. ఆ తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె క్షేమంగా బయటపడ్డారు. ఇక కొన్నాళ్లకు శ్రీకాంత్ తన మొదటి భార్య దగ్గరే ఎక్కువ కాలం గడపడం దాన్ని జీర్ణించుకోలేకపోయింది. మరొకవైపు పిల్లలు కలగలేదన్న బాధ.. మరొకవైపు జయప్రదకు సంబంధించి మార్కింగ్ చేసిన ఫోటోలు బయటకు రావడంతో అప్పుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అలా చాలా యేళ్లు వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది జయప్రద.