అధికార బిఆర్‌ఎస్ పార్టీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కరెక్ట్ గా కేసిఆర్..బిఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించే ముందే మైనంపల్లి..మంత్రి హరీష్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటుతో పాటు తన కుమారుడుకు మెదక్ అసెంబ్లీ సీటు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చేసే లోపే అభ్యర్ధుల లిస్ట్ కూడా ఖరారైంది..దీంతో మల్కాజిగిరి స్థానానికి మైనంపల్లిని ప్రకటించారు. కానీ మెదక్ స్థానానికి మళ్ళీ పద్మా దేవేందర్ రెడ్డిని ప్రకటించారు. ఇక హరీష్ పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలని కేటిఆర్, కవిత సైతం ఖండించారు. మైనంపల్లిని బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం వచ్చింది. ఆయన సీటు కూడా క్యాన్సిల్ చేస్తారని అన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో గాని..మొత్తం సీన్ రివర్స్ అయింది. మైనంపల్లి నియోజకవర్గానికి వచ్చారు. తాను పార్టీని ఏం అనలేదని, తన మాటలు కేవలం వ్యక్తిగతం మాత్రమే అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో వారం రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి..కార్యకర్తలతో మాట్లాడి తర్వాత ఏ నిర్ణయమైన తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దీంతో మైనంపల్లి పార్టీ మార్పు అనేది బ్రేకు పడింది. అటు సస్పెన్షన్ కూడా ఆగింది. మైనంపల్లికి ఓ బిఆర్‌ఎస్ ముఖ్యనేత ఫోన్ చేసి కొన్ని రోజుల పాటు వేచి చూడాలని చెప్పడంతో మైనంపల్లి అంశం కాస్త పెండింగ్ లో పడిందని తెలిసింది.
అందుకే వెంటనే కూడా ఆయనని సీటు నుంచి తప్పించడం చేయలేదు. దీని బట్టి చూస్తే కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత మైనంపల్లిని బిఆర్‌ఎస్ లోనే కొంసాగిస్తారని తెలుస్తోంది. కానీ మైనంపల్లి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఆయన బిఆర్‌ఎస్ లోనే ఉంటారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా? అనేది చూడాలి.