ప‌వ‌న్‌కు ఏమైంది.. ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నాడు

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. జ‌రుగుతున్న ప్ర‌తి ఘ‌ట‌న‌పై స్పందించేవారు. అలాంటిది గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న సైలెంట్‌గా ఉంటున్నాడు. ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆన పెద్ద‌గా స్పందించ‌డం మానేశారు. క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా స్పందించ‌ట్లేదు.

దీనికి కార‌ణం కూడా ఉంది. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం కొవిడ్ నెగెటివ్ వ‌చ్చినా.. ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే బ‌య‌ట‌కు రాంకు శంకర్‌పల్లిలో ఉన్న ఫామ్ హౌజ్‌లో డాక్ట‌ర్ల స‌మ‌క్షంలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పుడు ఆయ‌న ఆరోగ్యం విషయంలో అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్ట‌ర్లు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనే వైద్యుల సూచన మేర‌కు ఆయన రెస్ట్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఎక్కువ‌గా నీరసంగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version