తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. 2009వ సంవత్సరంలో ఫెమినా అందాల పోటీలలో ఫైనల్ లిస్టులో నిలబడిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఇందులో కొన్ని చిత్రాలలో నటించి మంచి విజయాలను అందించిన ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు ఇంతకీ హీరోయిన్ ఎవరనే విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ దీక్షాసేత్.
అయితే ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తెలుగులో సరిగ్గా అవకాశాలేమి రాకపోవడంతో ఇమే బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లినట్లు సమాచారం. మొదటిసారిగా 2014వ సంవత్సరంలో లేకర్ హమ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టింది. ఇదే సంవత్సరం హిందీలో కూడా మరొక సినిమాలో చేసింది.
ఇక దీక్షాసేథ్ చివరి చిత్రం ఇదే కావడం కూడా గమనార్హం ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది ఏమైంది అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు.