సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి పొజీష‌న్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె బిజినెస్ మ్యాన్ రామ్‌ను పెండ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆమె జీవితాన్ని మ‌లుపు తిప్పింది ఓ షో.

1995లో దూరదర్శన్ లో ఫ‌స్ట్ టైమ్ స్టార్ట్ అయిన సింగింగ్ కాంపిటీషన్ షో అయిన పాడవే కోయిలలో సునీత ఓ అద్భుత‌మైన పాట పాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ షో ద్వారానే సునీత కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయింది.

దాంతో వ‌రుస‌గా ఆమెకు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. అందులో భాగంగా గులాబీ మూవీలో ఆమె పాడిన ఈ వేళ నీవు ఏం చేస్తు ఉంటావో.. పాటతో ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోకుండా చేసింది. ఈ పాట విన్న చాలామంది ఆమెకు వ‌రుస‌గా పెద్ద సినిమాల్లో పాడే ఛాన్స్ ఇచ్చారు. ఇక అక్క‌డి నుంచి ఆమె కెరీర్ పెద్ద స్థాయిలోనే కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఆమె బుల్లితెరలో వ‌చ్చే డ్రామా జూనియర్స్ షోకు జడ్జిగా చేస్తున్నారు.