బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో నిర్వహించబోయే పదో తరగతి ఇంటర్ పరీక్షలను జగన్ సర్కార్ రద్దు చేస్తున్నట్టు కాసేపటి క్రితమే పేర్కొంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సుప్రీం కోర్టులో పరీక్షలపై విచారణ జరిగిందనీ… పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతోందన్నారు.

సుప్రీం చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని వెల్లడించారు ఆదిమూలపు సురేష్. అనేక తర్జన భర్జనల అనంతరం పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం ఉన్నామని పేర్కొన్నారు. మార్కుల అసెస్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపై హైపవర్ కమిటీని నియమిస్తున్నామని చెప్పారు ఆదిమూలపు సురేష్. పరీక్షల రద్దు వల్ల ఏపీ విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా… ఈ పరీక్షల నేపథ్యంలో ఇవాళ ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.