ఏంటీ.. మహేష్ బాబు ఉపయోగించే బ్యాగ్ ధర అన్ని లక్షలా..?

-

ఎక్కడ చూసినా సరే సెలబ్రిటీలను ఒక కంట కడిపెడుతూ ఉంటారు నెటిజన్స్.. ముఖ్యంగా వాళ్లు పెట్టే పోస్ట్ల దగ్గర నుండి వాళ్లు ఉపయోగించే వస్తువుల వరకు అన్నింటి పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అందరి కళ్ళు వాళ్ల వస్తువుల మీదే.. పొరపాటున వారు వాడే వస్తువు రేర్ గా దొరికేదో లేక బాగా కాస్ట్లీ దో అయిందంటే చాలు ఇక దానిని వైరల్ చేయడమే పని అన్నట్లుగా మారిపోయింది.. ఈ క్రమంలోనే తాజాగా ఆ నెటిజన్ల కంటికి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగ్ తో సహా దొరికిపోయారు.

వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటాడు. హంగు ఆర్భాటం ఉండదు. ప్రశాంతంగా ఉంటాడు. ఆయన వేసుకునే బట్టలు.. వాడే వస్తువులు కూడా అంతే సింపుల్గా.. కాస్ట్లీ గా ఉంటాయి. ముఖ్యంగా వాటి ధరలు చూస్తే మన మతులను పోగొడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆయన పక్క బ్రాండ్ మెయింటైన్ చేస్తూ చాలా సింపుల్ గా కనిపించేలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏదైనా పార్టీలకు, సినిమా వేడుకలకు వచ్చినప్పుడు సాదాసీదాగా కనిపిస్తారు.

కానీ ఏదైనా లొకేషన్స్ కి వెళ్తే మాత్రం ఆయన రీచ్నెస్ తెలిసిపోతుంది. ఫ్యామిలీతో కలిసి ఏడాదికి ఐదారు సార్లు టూర్లు వెళుతూ ఉంటాడు మహేష్ బాబు . ఆ సమయంలో కాస్లి వస్తువులతో దొరికిపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ పోర్ట్ లో లూయిస్ విట్టన్ బ్యాగుతో కనిపించాడు మహేష్ బాబు దాంతో నేటిజెన్లు దాని ధర వెతకడం మొదలుపెట్టారు. ఇక ఈ బ్యాగును వైరల్ చేయడం స్టార్ట్ చేయడమే కాదు ఆ బ్యాగ్ స్పెషల్ ఏంటి ?దాని ధర ఎంత? అనే విషయాలను కూడా వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ బ్యాగ్ అసలు ధర రూ.4 లక్షలు.. ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. క్రిస్టోఫర్ ఎం ఎం బ్యాక్ ప్యాక్ ను హై ఎండ్ ఫ్యాషన్ గా భావిస్తారు. నలుపు, నీలం డిజైన్తో ఎంతో అందంగా ఉంటుంది ఈ బ్యాగ్. అంతేకాదు ఎల్వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా బ్యాగుపై ఉంటుంది. స్టైల్ పరంగా మాత్రమే కాదు కంఫర్ట్ గా కూడా ఉంటుంది.అందుకే సెలబ్రిటీలు ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version