వెంకటేష్ సినిమా సెట్ లో బాలయ్య సందడి..!

-

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కొత్త మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్ లో నటుడు బాలకృష్ణ సందడి చేశారు. హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

F2, F3 తరువాత విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దిల్ రాజు సమర్పణలో శిరిష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కథానాయికలుగా నటించనున్నారు.  క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటించనున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు గతేడాది భగవంత్ కేసరి మూవీతో విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 మూవీ కోసం వర్క్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version